రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీలు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తుల ప్రాణాలు రోడ్డు ప్రమాదం రూపంలో గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్ బస్సులో భవానీ భక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులో తలెత్తిన మరమత్తుల కారణంగా కత్తిపూడి వద్ద రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి విజయవాడకు కారులో వస్తున్న మరో బృందం వారిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు భవానీ భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని కాకినాడ డీఎస్పీ తిలక్ మరియు స్థానిక పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై  మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమ్మవారి దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment

3