తెలంగాణ లోని ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉద్యమకారుడు, విద్యావేత్త డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. దసరా పర్వదినం శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న మొట్టమొదటి అభ్యర్థిని ఖరారు చేస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక కావడంతో ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బలమైన విద్యా నేపథ్యం ఉన్న ఉద్యమ నేతను బరిలో నిలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని, గ్రౌండ్ లెవల్ సమన్వయాన్ని వేగవంతం చేసేందుకు పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని కూడా రంగంలోకి దించారు. ఈ ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు స్టేట్ పార్టీ అబ్జర్వర్, ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను కల్వకుంట్ల కవిత నియమించారు. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేలా పక్కా కార్యాచరణను రూపొందించాలని ఇస్మాయిల్‌కు బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ సుదీర్ఘమైన ఉద్యమ, విద్యా నేపథ్యం కలిగిన నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి సంస్థ ప్రారంభమైన నాటి నుంచి కల్వకుంట్ల కవిత వెన్నంటి నడిచిన ఆయన.. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో, ప్రజా సంఘాల వేదికలపై సమర్థవంతంగా గళం వినిపిస్తూ ప్రజల్లో విశేష గుర్తింపు పొందారు. బహుజనుల గొంతుకగా నిలుస్తూ నిరంతరం ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్న కల్వకుంట్ల కవిత.. అదే సంప్రదాయాన్ని తొలి ఎన్నికల అభ్యర్థి ఎంపికలోనూ కొనసాగించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ విధానాలను చేతల్లో చాటిచెప్పారు. తెలంగాణ రక్షణ సేన నేరుగా ఎన్నికల క్షేత్రంలోకి దిగడం, అందునా విద్యావంతులు, నిరుద్యోగులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న పట్టభద్రుల స్థానాన్ని ఎంచుకోవడంతో వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా మారింది.
Home
Kalvakuntla Kavitha officially announced
MLC Elections for Graduates' Constituency
Nalamasa Srikanth Goud Named as Telangana Rakshana Sena Candidate
ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు : తెలంగాణ రక్షణ సేన పార్టీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

