తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో కుటుంబ కలహాలు ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భర్త, అత్తమామలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సోమేసరా నయా గ్రామానికి చెందిన ప్రియాంక మాల్ (26), భర్త పరాస్ మాల్‌తో కలిసి జీవనోపాధి కోసం వలస వచ్చి చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరు అక్కడ కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి భర్త, అత్తమామలు ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. దండు మల్కాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మథకుమార్ కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న కుటుంబ కలహాలు
by Telugu Lo Computer at October 22, 2026
Labels:
Choutuppal mandal
,
Dandu Malkapuram village
,
Family Dispute Claims a Woman’s Life
,
telangana
,
Yadadri Bhuvanagiri district
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment