వరుసగా రెండు త్రైమాసికాల్లో రూ.4 వేల కోట్లు ఆదాయం దాటిన భారత తపాలా శాఖ : కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

భారత తపాలా శాఖ గత వరుస రెండు త్రైమాసికాల్లో రూ.4,000 కోట్ల ఆదాయాన్ని పొందింది, సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు. 'ఇండియా పోస్ట్' బ్రాండ్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తపాలా శాఖ, సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన రెండో త్రైమాసికంలో 25 శాతం వృద్ధితో రూ. 4,202 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, గత ఏడాది ఏడాది ఇదే సమయంలో ఇండియా పోస్ట్ ఆదాయం రూ. 3,355 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తపాలా శాఖ రెండో త్రైమాసికంలో రూ. 4,202 కోట్ల ఆదాయాన్ని సాధించిందని, ఇది గత త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 5 శాతం వృద్ధిని కనబర్చిందని తెలిపారు. ఇండియా పోస్ట్ చరిత్రలో వరుసగా రెండు త్రైమాసికాల పాటు రూ. 4,000 కోట్ల మార్కును అధిగమించడం ఇదే మొదటిసారి ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

3