హార్మూజ్ జలసంధిలో ఏడు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. ఇరాన్ సైన్యం దాడులు లేదా సీ మైన్స్ ఢీ కొని ఈ చమురు నౌకలు ధ్వంసం అయినట్లు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొత్త హెచ్చరికలను జారీ చేసింది. తాజా ఘటన నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ చమురు ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఇదే విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. మరోవైపు హార్మూజ్ జలసంధిపై ఇలాంటి దాడులు రాజకీయంగా ఇజ్రాయెల్, అమెరికాకు సమస్యాత్మకంగా మారనున్నాయి. ఈ రెండు దేశాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ లో అక్టోబర్ 27 న ఎన్నికలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారం కోల్పోయే అవకాశం ఉన్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అటు అమెరికాలో వచ్చే నెల మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక ఇరాన్ తో యుద్ధం కారణంగా ధరలు పెరిగాయంటూ అమెరికన్ ప్రజలు అక్కడి ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఏడు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులను ప్రారంభిస్తే ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై ఇజ్రాయెల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ రీసెర్చర్ డానీ సిట్రినోవిక్జ్ మాట్లాడుతూ.. ఇరాన్ పై దాడులకు నెతన్యాహు సిద్ధం అవుతున్నారని.. అది పెద్ద ప్రశ్నే కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఇజ్రాయెల్.. ఇరాన్ పై దాడులకు సిద్ధం అవుతోందని.. ఇరాన్ మిలిటరీ వ్యూహాన్ని పూర్తిగా అంచనా వేయకుండా మరోసారి దాడులు చేసేందుకు యత్నిస్తోందని స్పష్టం చేశారు. అక్టోబర్ 27 న జరిగే ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు పార్టీ విజయం సాధిస్తే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడే అవకాశం కచ్చితంగా ఉందని డానీ సిట్రినోవిక్జ్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. అమెరికాకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సాయం చేస్తే హార్మూజ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని పేర్కొన్నాయి.
హార్మూజ్ లో సీ మైన్స్ ఢీ కొని ఏడు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం
by Telugu Lo Computer at October 22, 2026
Labels:
international
,
Islamic Revolutionary Guard Corps of Iran has issued new warnings
,
Seven Oil Tankers Destroyed After Striking Sea Mines in the Strait of Hormuz
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment