కర్ణాటకలోని కొడగు జిల్లా మడికెరి తాలూకా మాల్యారె పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్ (36), ఆయన భార్య ప్రమిత (34), చిన్న కూతురు లియ (4) ఈ దుర్ఘటనలో మృతి చెందారు. విజేశ్ దంపతులు తమ కారులో మాల్యారెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ తమ పెద్ద కూతురిని ఉంచి, చిన్న కూతురు లియను వెంటబెట్టుకుని తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు తిరిగి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలో చెరువు కట్టపై వెళ్తుండగా, కారు అకస్మాత్తుగా అదుపుతప్పి కిందకు జారిపోయి చెరువులోని బురదలోకి దిగబడిపోయింది. రాత్రి సమయం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం బయటపడలేకపోయారు. కారులోనే ఊపిరాడక వారు ముగ్గురూ ప్రాణాలు వదిలారు. ఉదయం ఆ దారిన వెళ్తున్న కొందరు కార్మికులు చెరువులో కారును గమనించి, వెంటనే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించారు. కార్మికులు కారులోని వారిని బయటకు తీసి సిద్ధాపుర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మడికెరి ఆస్పత్రికి తరలించారు.
అదుపుతప్పి చెరువులోని బురదలోకి దిగబడిపోయిన కారు : ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
by Telugu Lo Computer at October 22, 2026
Labels:
Car veers off road and sinks into pond mud
,
karnataka
,
Kodagu district
,
Malyare area of Madikeri taluk
,
Three members of the same family die of suffocation
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment