సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని అధిక మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని నమ్మించి మోసగిస్తున్న ముఠా అరెస్టు

తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక రుణాలు ఇప్పిస్తామని, బంగారం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 09.10.2026న Cr.No.395/2026, U/s 316(2), 318(4) r/w 3(5) BNS కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా నిన్న ఉదయం సుమారు 9 గంటల సమయంలో అత్తాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు షమీన బేగం, ఫాతిమా, మొహమ్మూద్ లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో నిందితులు విల్లాల ప్రాంతాల్లో నివసించే సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని, అధిక మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. రుణాలు ఇప్పించినందుకు కోటి రూపాయలకు రూ.5 లక్షల కమిషన్ తీసుకుంటామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది. అదేవిధంగా తక్కువ ధరకు బంగారం, పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తప్పుడు హామీలతో బాధితులను నమ్మించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.35,00,000 నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

CHUYÊN MỤC

Artikel Menarik Lainnya

No comments