రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రెడీ-టు-డ్రింక్ పాల ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ తమిళనాడులో రూ. 20 ధరతో 'జాయ్‌ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్'ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లకు పాల ఉత్పత్తులను అందుబాటు ధరలో అందించడమే కంపెనీ లక్ష్యమని ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రకటనలో తెలియచేసింది. జాయ్‌ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్ బ్రాండ్ తో, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తన పానీయాల పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. కంపెనీ ప్రకారం, జాయ్‌ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్‌ను నిజమైన పాల పదార్థాలతో తయారు చేస్తామని తెలిపింది. ప్రారంభంలో స్ట్రాబెర్రీ, వెనీలా ఫ్లేవర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఉత్పత్తి ద్వారా, పాల రుచిని, పోషక ప్రయోజనాలను ప్యాకేజ్డ్ డ్రింక్ రూపంలో కస్టమర్లకు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ ప్యాకేజ్డ్ డ్రింక్ ధరను అయిన రూ. 20 కేటగిరీలో ప్రారంభం కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన పంపిణీ వ్యవస్థ, రిటైల్ మార్కెట్ చైన్ సిస్టం, వినియోగదారుల అవగాహనను ఉపయోగించుకొని, ఈ ఉత్పత్తిని మార్కెట్లో మరింతగా విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమిళనాడులో ప్రారంభించిన అనంతరం, దీనిని దేశంలోని ఇతర ప్రాంతాలలో దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. కంపెనీ ప్రణాళికలు కేవలం ఫ్లేవర్డ్ మిల్క్‌కు మాత్రమే పరిమితం కాలేదు. భవిష్యత్తులో, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 'జాయ్‌ల్యాండ్' బ్రాండ్ క్రింద కొత్త ఫ్లేవర్లను ప్రవేశపెట్టాలని, ఇతర మిల్క్ బేస్ పానీయాల విభాగాలలోకి విస్తరించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా, రెడీ-టు-డ్రింక్ పాల ఉత్పత్తుల మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కంపెనీ సిద్ధమవుతోంది. రెడీ-టు-డ్రింక్ పాల ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించడం అనేది కంపెనీని విస్తరించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ పేర్కొన్నారు. జాయ్‌ల్యాండ్ ద్వారా, తక్కువ ధరలకు డైరీ ఉత్పత్తులు వీలైనన్ని ఎక్కువ కుటుంబాలకు చేరేలా చూడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 'జాయ్‌ల్యాండ్' ఫ్లేవర్డ్ మిల్క్ విడుదల ద్వారా పాల ఆధారిత పానీయాల విభాగంలోకి ఆ సంస్థ విస్తరణకు సంకేతంగా నిలిచింది. ఈ మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.
Home
announced the launch of 'Joyland Flavored Milk' in Tamil Nadu
,
business
,
Flavored Milk Priced at Just ₹20
,
Reliance Consumer Products Limited Enters the Ready-to-Drink Milk Products Market
రెడీ-టు-డ్రింక్ పాల ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్
Written By
