తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఐఎమ్డీ అంచనాల ప్రకారం, అక్టోబరు 15 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తొలి రోజు ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అక్టోబరు 16న పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అలాగే 17 నుంచి 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. అక్టోబరు 15న అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ అంచనా వేసింది. ఇక అక్టోబరు 16న అల్లూరి జిల్లాతో పాటు రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ 'యెల్లో అలర్ట్' జారీ చేసింది. అక్టోబరు 17న కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే సూచనలున్నాయి. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపటి నుంచి అక్టోబరు 18 వరకు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడి, ప్రజలకు ఎండ వేడిమి నుంచి పెద్దఎత్తున ఉపశమనం లభించనుంది.
Home
Alluri Sitarama Raju district on October 15
,
from October 15 to October 20 in Telangana
,
India Meteorological Department
,
Rainfall Likely in Andhra Pradesh
,
Telangana Over the Next Few Days
,
weather
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం : భారత వాతావరణ శాఖ
Written By
