లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల

లెనోవో కొత్త ప్రీమియం ట్యాబ్లెట్ యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2ను IFA 2026 వేదికగా విడుదల చేసింది. అత్యాధునిక హార్డ్‌వేర్‌తో వచ్చిన ఈ ట్యాబ్లెట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 13 అంగుళాల 4K డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 12,700mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.పెద్ద స్క్రీన్, శక్తివంతమైన ప్రాసెసర్, ఎక్కువ స్టోరేజ్, ప్రీమియం ఆడియో వంటి ఫీచర్లతో లెనోవా ఈ ట్యాబ్లెట్‌ను రూపొందించింది. దీని ప్రారంభ ధర 849 యూరోలుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.93,000కు సమానం. ఈ ట్యాబ్లెట్ కాస్మిక్ బ్లూ కలర్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ నెల చివర్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత మార్కెట్లో దీని ధర, అమ్మకాల తేదీపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఈ ట్యాబ్లెట్‌లో 13 అంగుళాల 4K డిస్‌ప్లే అందించారు. ఇది 3,840 × 2,560 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే ప్రత్యేకతల్లో ముఖ్యంగా 144Hz రిఫ్రెష్ రేట్ చెప్పుకోవచ్చు. వినియోగాన్ని బట్టి స్క్రీన్‌ను 120Hz, 90Hz, 60Hz, 30Hz రిఫ్రెష్ రేట్లలో కూడా ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్ గరిష్టంగా 1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. HDR కంటెంట్ కోసం Dolby Vision సపోర్ట్ కూడా ఉంది. అంతేకాకుండా 3:2 యాస్పెక్ట్ రేషియో, 355ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. పనితీరు కోసం లెనోవో ఇందులో Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ప్రీమియం ట్యాబ్లెట్ సెగ్మెంట్‌కు తగిన విధంగా శక్తివంతమైన పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అదనంగా మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. లెనోవో ప్రకారం ఈ ట్యాబ్లెట్‌కు ఏడు OS అప్‌గ్రేడ్‌లు, అలాగే 2033 వరకు ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది. అయితే OS, సెక్యూరిటీ అప్‌డేట్ల లభ్యత మార్కెట్, డివైస్ లభ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Share this

Related Posts

Previous
Next Post »