సినీ నటి రష్మిక యాసను హేళన చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతుందని హేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రోలింగ్‌పై రష్మిక స్పందిస్తూ తను దక్షిణాది నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి సహజంగానే తనలో ఆ యాస ఉంటుందని చెప్పింది. తాజాగా భర్త విజయ్ దేవరకొండతో కలిసి 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో పాల్గొన్న ఆమె తన యాసపై వచ్చిన ట్రోల్ గురించి మాట్లాడుతూ 'ఇలాంటి విమర్శలను తాను ఎన్నో చూశానని, వాటి కారణంగా తనను తాను ఎప్పుడూ హద్దులు విధించుకోవాలని ఆలోచించలేదని చెప్పింది. 'నేను సౌత్ యాసలో మాట్లాడుతున్నానని ట్రోల్ చేస్తున్నారు. అది నిజమే, నేను దక్షిణాది నుంచి వచ్చాను. అందుకే నాలో ఆ యాస సహజంగానే ఉంటుంది. అలా కాకుండా మరోలా మాట్లాడాలనుకోవడం సమంజసం కాదు. ఇలాంటి ట్రోల్ నాకు కొత్తేమీ కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నా మాట, నటన, యాస.. ఇలా దేనిని వదలడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. వారి కోసం నాకొచ్చిన అవకాశాలను మిస్ చేసుకోవాలనుకోలేదు' అని రష్మిక అన్నారు.
నేను దక్షిణాది నుంచి వచ్చాను, అందుకే నాలో ఆ యాస సహజంగానే ఉంటుంది : 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో రష్మిక
by Telugu Lo Computer at October 22, 2026
Labels:
"I come from the South
,
cinema
,
encountered such criticism many times
,
Rashmika on 'Koffee with Karan'
,
so that accent is natural to me"
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment