గోవాలోని మడ్గావ్లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోవాలో బీజేపీ ప్రభుత్వ అవినీతితో పాటు దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ వెనుక నరేంద్ర మోడీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర ఉందని ఆరోపించారు. నరేంద్ర మోడీ తెరవెనుక ఉండి ఈ పూర్తి ప్రణాళికను నడిపిస్తుంటే అమిత్ షా ఈ వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయిస్తున్నారని, ఇక జ్ఞానేష్ కుమార్ ఓట్ల దొంగతనాన్ని ప్రత్యక్షంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జ్ఞానేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారని ఆయన రాత్రివేళ సరిగ్గా నిద్రపోలేకపోతున్నారని అతడు ప్రశాంతత కోల్పోయారని రాహుల్ అన్నారు. ఆయనతో పాటు నరేంద్ర మోడీ, అమిత్ షాలు కూడా సరిగ్గా నిద్రపోలేకపోతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ వారిని జవాబుదారీగా నిలబెడుతుందని, త్వరలోనే వారు శిక్ష అనుభవిస్తారన్నారు. తనపై ఇప్పటికే మోడీ, అమిత్ షా ఇతరులు దాదాపు 45 డిఫమేషన్ కేసులు పెట్టారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. "నాపై 45 కేసులు ఉన్నప్పటికీ మోడీ ఓట్లను దొంగిలిస్తున్నారని నేను ప్రతీ వేదికపై చెబుతూనే ఉన్నాను. కానీ, ప్రత్యేకంగా ఈ వ్యాఖ్యలపై నాపై కేసు పెట్టడానికి వారికి ధైర్యం సరిపోవడం లేదన్నారు. ఎందుకంటే ఓట్ల దొంగతనంపై కేసు నమోదు చేస్తే కోర్టులో సుదీర్ఘమైన చట్టపరమైన విచారణ ప్రారంభమై, దానిలో వారే స్వయంగా చిక్కుకుపోతారనే భయం వారిని వెంటాడుతోందని రాహుల్ అన్నారు. గోవా పాలకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. గోవాలో అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. నిజం చెప్పాలంటే ఇది ప్రస్తుతం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిపోయిదని ప్రస్తుత పాలకులు గోవాను అవినీతికి ఒక మోడల్గా మార్చేశారని అని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మేం రాజ్యాంగానికి రక్షకులమని అది మా పవిత్రమైన బాధ్యత అన్నారు. ఓట్లను దొంగిలించడం ద్వారా వారు రాజ్యాంగంపై, మా పవిత్రమైన బాధ్యతపై దాడి చేశారు. దీనిని మేం ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు.
Home
Amit Shah
and Gyanesh Kumar play a key role in the theft of votes taking place in the country
Goa
Narendra Modi
national
Rahul Gandhi at a public meeting in Margao
దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ వెనుక నరేంద్ర మోడీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ లకు కీలక పాత్ర ఉంది !
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

