Sunday, October 18, 2026

పులివెందుల వైకాపా ఆఫీస్ వద్ద ముళ్లకంచె : అవినాశ్ రెడ్డి గృహ నిర్బంధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఆదివారంతో ముగియనుంది. దీంతో కడప జిల్లాలోని పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే, పులివెందుల వైకాపా కార్యాలయం చుట్టూత ఇనుప ముళ్ల కంచెలు వేశారు. కార్యాలయం వద్ద ఎవరూ గుమికూడకుండా ఆంక్షలు కూడా విధించారు. మరోవైపు, కడప నగరంలో వైకాపా నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషాను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనూ పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని నరసరావుపేటలోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.