3

తల్లి వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన కుమారుడిని ప్రియుడితో చంపించిన తల్లి

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో తల్లి వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన కుమారుడిని ఆమె, తన ప్రియుడు, ప్రియుడి నలుగురు స్నేహితులతో కలిసి గొంతు నులిమి హత్య చేశారు. మృతుడిని బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన నారాయణ్‌గా గుర్తించారు. అతని తల్లి మీనా నారాయణ్ ఓ బ్యూటీ పార్లర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన రాజేశ్ జమునీతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. అతడిని మీనా తన డ్రైవర్‌గా నియమించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లి మీనా, రాజేశ్ మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న కుమారుడు నారాయణ్ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో ఆ జంట తమ సంబంధాన్ని రహస్యంగా కొనసాగించేది. అయితే నారాయణ్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు అతడిని హత్య చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలను చూపిస్తామని చెప్పి నారాయణ్‌ను బెళగావికి తీసుకెళ్లారు. హత్యకు పథకం అమలు చేసేందుకు మీనా, రాజేశ్‌తో పాటు అతడి నలుగురు స్నేహితుల సహాయం తీసుకున్నారు. అనంతరం జెండాతో నారాయణ్ గొంతు బిగించి దారుణంగా హత్య చేశారు. నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవం రోజున హైవే పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డుల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. కాల్ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు హత్య వెనుక ఉన్న కుట్రను గుర్తించారు. ఈ హత్యలో స్వయంగా మృతుడి తల్లి కూడా పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మీనా, రాజేశ్‌తో పాటు అతడి నలుగురు స్నేహితులను కలిపి మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Post

Latest
Previous
Next Post »