3

భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి : భారతీయుడి అదృశ్యం : భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు అదృశ్యం కావడంతో అతడి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ తారా గ్యాస్ అనే ఎల్‌పీజీ ట్యాంకర్‌పై నవంబర్ 16న హార్ముజ్ జలసంధిలో దాడి జరిగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 21 మందిని బయటకు తీసుకొచ్చి ఒమన్‌లోని ఖసబ్ ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఒక భారతీయుడి ఆచూకీ లభించలేదు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ప్రమాద సమయంలో స్పందించి భారతీయ సిబ్బందిని రక్షించడంలో సహకరించిన ఒమన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గాయపడిన ఇద్దరు భారతీయులకు వైద్య సహాయం అందిస్తున్నందుకు థ్యాంక్స్‌ చెప్పింది.

Related Post

Previous
Next Post »