ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియను అడ్డుకోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం 21 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార పక్షం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా నిలువరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లోని ఆ 21 గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులందరితో తప్పనిసరిగా నామినేషన్లు వేయించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు వెళ్లే క్రమంలో గానీ, పత్రాలు దాఖలు చేసే సమయంలో గానీ ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి, దగ్గరుండి ఈ 21 గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, ఎలాంటి ఒత్తిళ్లు లేని వాతావరణంలో వారు నామినేషన్లు దాఖలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది.
3
Beranda
› Andhra Pradesh
› High Court Expresses Outrage Over Obstruction of Nominations in Pulivendula
› Kadapa district
› పులివెందుల నామినేషన్ల అడ్డగింతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
Subscribe to:
Post Comments (Atom)
