3

భార్య లేదా అమ్మకు గ్రామ సర్పంచ్ పదవి ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.1.20 కోట్లు ఇస్తా : దుర్గాడ పంచాయతీలో యువకుడి ఆఫర్ !

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీ సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో ఓ వ్యక్తి పాల్గొని  తన భార్య లేదా అమ్మకు గ్రామ సర్పంచ్ పదవి ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.1.20 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడు. మరికొందరు కూడా భారీగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో గ్రామ పెద్దలు వేలం పాటలు నిర్వహించారు. స్థానిక శివాలయంలో బుధవారం రాత్రి కొందరు గ్రామ పెద్దలు సర్పంచి పదవికి బహిరంగ వేలం చేపట్టారు. వచ్చిన సొమ్మును ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించారు. ఇక్కడి సర్పంచి స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. బహిరంగ వేలంలో ముగ్గురు పాల్గొన్నారు. ఈ వేలంలో నిర్ణయించిన అభ్యర్థి కాకుండా ఇతరులు ఎవరైనా పోటీ చేసినా హెచ్చు పాటదారును గెలిపించాలని నిర్ణయించారు. ఇదేవిధంగా వార్డు సభ్యుల స్థానాలనూ ఏకగ్రీవం చేయాలని, ఒకవేళ ఎన్నికలు జరిగితే కమిటీ మెజారిటీ సభ్యులను గెలిపించాలని తీర్మానించారు. గతంలో కూడా ఈ గ్రామంలో సర్పంచి పదవిని రెండుసార్లు వేలం వేశారు.

Related Post

Previous
Next Post »