3

నవంబర్ 24న మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ విడుదల

దేశీయ మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 24న విడుదల చేస్తునట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా కంపెనీ ఈరోజు లాంచ్ డేట్ తో పాటు రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED డిస్‌ప్లే అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5,200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్‌ తో లాంచ్ అవుతుంది. ఇందులో గరిష్ఠంగా 8GB LPDDR5X ర్యామ్ మరియు AI RAM Boost టెక్నాలజీ ఉండనున్నాయి. ఈ ఫోన్ లో OIS 50MP Sony LYTIA 710 ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాని Ultra HDR సపోర్ట్‌, AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, నైట్ విజన్ మరియు 10X Super Zoom వంటి ఫీచర్లతో అందిస్తుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అలాగే ఆడియో పరంగా, ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇందులో 7,000mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W Turbo Power ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల వరకు ఉపయోగించుకోవచ్చని టీజర్ లో కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 7.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ అండ్ MIL-STD-810H సర్టిఫికేషన్ తో మంచి డ్యూరబుల్ మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుందని మోటోరోలా టీజింగ్ చేసింది.

Related Post

Previous
Next Post »