గేమింగ్ ఇష్టపడేవారిని ఆకట్టుకునే ప్రత్యేకమైన బ్రాండ్లలో అసూస్ రోగ్ 8 ప్రో గేమింగ్‌తో పాటు రోజువారీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రీమియం ఫోన్‌గా నిలుస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మన్స్ కోరుకునే వినియోగదారుల కోసం ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, మల్టీటాస్కింగ్ చేయడం వంటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది మంచి ఎంపిక. సాధారణ స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా గేమింగ్ అనుభూతికి ప్రాధాన్యత ఇచ్చే రోగ్ సిరీస్‌లో ఈ మోడల్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.గేమింగ్ ఫోన్ల సెగ్మెంట్ లో మంచి గుర్తింపు పొందిన అసూస్ ఈ మోడల్ ద్వారా గేమింగ్ అవసరాలతో పాటు కెమెరా, ఎంటర్‌టైన్‌మెంట్, రోజువారీ పనులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా దీన్ని అభివృద్ధి చేసారు .ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల Samsung E6 AMOLED LTPO డిస్‌ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 720Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ ఉంటుంది . ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3.3GHz క్లాక్ స్పీడ్‌తో పాటు Adreno 750 GPU గ్రాఫిక్స్ సపోర్ట్ ఉంది. గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు GameCool 8 కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. కెమెరా పరంగా 50MP Sony IMX890 ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 5MP మాక్రో ట్రిపుల్ కెమెరా ఉన్నాయి. ప్రధాన కెమెరాలో 6-Axis హైబ్రిడ్ Gimbal స్టెబిలైజర్ 3.0, OIS సపోర్ట్ తో ఉంటుంది . సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ 32MP కెమెరా ఇచ్చారు. బ్యాటరీ పరంగా 5,500mAh సామర్థ్యంతో పాటు 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. కంపెనీ ల్యాబ్ పరీక్షల ప్రకారం సుమారు 39 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ ఫోన్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది . గేమింగ్ కోసం AirTrigger కంట్రోల్స్, X Mode, X Sense 2.0, X Capture వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు డిస్‌ప్లే గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi, Bluetooth, NFC, GPS, USB Type-C వంటివి ఉన్నాయి. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌తో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. స్టోరేజ్ లో వేరియంట్‌ను బట్టి 16GB RAM, 512GB స్టోరేజ్ లేదా 24GB RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వేగవంతమైన LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్ Phantom Black కలర్‌లో లభిస్తుంది. వెనుకవైపు ROG Fearless Eye లోగోతో కూడిన Aura RGB లైటింగ్ ఆకర్షణగా నిలుస్తుంది. గేమింగ్‌తో పాటు ఫోటోగ్రఫీ, వీడియోలు, మల్టీటాస్కింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.
3
Beranda
› attractive design and powerful performance
› business
› smart phone
› technology
› The Asus Rogue 8 Pro is a must-have for gaming enthusiasts
› గేమింగ్ ఇష్టపడేవారిని ఆకట్టుకునే అసూస్ రోగ్ 8 ప్రో
Subscribe to:
Post Comments (Atom)
