Ad Code

డిసెంబర్‌లో రోడ్లపైకి రానున్న ఒడిస్సే 'వాడెర్' !


ముంబైకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్, ఒడిస్సీ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ వర్గాలు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్ 'వాడెర్‌'ను లాంచ్ చేసింది. ఈ వెహికల్‌ను కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే సర్టిఫికేషన్ సమస్య కారణంగా మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు వాడెర్ బైక్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సర్టిఫికేషన్‌ పొందినట్లు బ్రాండ్ ధ్రువీకరించింది. ఈ వెహికల్ 2023 డిసెంబర్‌లో రోడ్లపైకి రానుంది. కొత్త బైక్ లాంచింగ్ గురించి కంపెనీ CEO, నెమిన్ వోరా మాట్లాడుతూ, ఒడిస్సే వాడెర్‌కు ICAT సర్టిఫికేషన్ లభించిందన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అందించడంలో తమ నిబద్ధతకు ఈ సర్టిఫికేషన్ నిదర్శనమని చెప్పారు. AIS-156-అప్రూవ్డ్ బ్యాటరీ ప్యాక్‌తో ఒడిస్సే వాడర్‌ను మార్కెట్‌లో స్పెషల్‌గా ఉంటుందని, ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటితో రైడింగ్‌కు మరింత కంఫర్ట్‌గా ఉంటుందని వివరించారు. యూనిక్ స్పెసిఫికేషన్లతో ఈ బైక్ రోజువారీ ప్రయాణానికి కంఫర్టబుల్‌గా ఉంటుందన్నారు. ఈ సర్టిఫికేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ఒడిస్సే వాడెర్ ఎలక్ట్రిక్ బైక్ 7-అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది వెహికల్‌కు సంబంధించిన RPM, స్పీడ్, రేంజ్, బ్యాటరీ లెవల్ వంటి స్టాటికల్ డేటాను డిస్‌ప్లే చేస్తుంది. తద్వాదా రైడర్ చాలా సింపుల్‌గా డేటాను ట్రాక్ చేయవచ్చు. ఇంటర్నెట్-ఎనేబుల్డ్ వాడెర్ గూగుల్ మ్యాప్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. దీంతో లాంగ్ రైడ్‌కు ఇది కంఫర్టబుల్‌గా ఉంటుంది. వాడెర్‌ బైక్‌ను కంపెనీ ఐదు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసింది. వెనమ్ గ్రీన్, ఫైరీ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, మిస్టీ గ్రే, గ్లాసీ బ్లాక్ వేరియంట్లను కస్టమర్లు సెలక్ట్ చేసుకోవచ్చు. ఒడిస్సీ ఆథరైజ్డ్ షోరూమ్స్‌లో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వాడెర్‌ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.  AIS 156 అప్రూవ్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ, IP67 అప్రూవ్డ్ 3000 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో రన్ అవుతుంది. వెహికల్‌ సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 125 కి.మీ. రైడింగ్ రేంజ్‌ అందిస్తుంది. ఈ బైక్ గరిష్టంగా 85 kmph స్పీడ్‌ను అందుకోగలదు. 128 కిలోల కర్బ్ వెయిట్‌తో వస్తుంది. బైక్‌లో ముందువైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu