హైదరాబాద్ లోని మీర్ పేట్ లో మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్, ఆయన భార్య అనిత కుటుంబంతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ, ధాతునగర్‌లో శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ బ్లాక్ ఎ లో మూడో అంతస్తులో గత నాలుగు సంవత్సరాలుగా అద్దెకుంటున్నారు. భర్త అరుణ కుమార్ నిదానిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి అనిత రక్తం మడుగులో పడి ఉంది. దీంతో వెంటనే తన తండ్రికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉండే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు శంషాబాద్ డీ సీ పీరాజేష్, ఆదిభట్ల ఏసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి, ఇన్స్పెక్టర్ బి శోభన్ లు క్లూస్ టీం తో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. హత్యకు గల కారణాలు నిందితుల కొరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
3
Beranda
› Anita (35)
› Arun Kumar—who hails from Tamil Nadu
› Brutal Murder of a Woman in Meerpet
› crime
› hyderabad
› lived with her husband
› victim
› హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య
Subscribe to:
Post Comments (Atom)
