ప్రధాని మోడీని గతంలో బహిరంగంగా ప్రశ్నించిన నార్వేకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ హెల్లె లింగ్ ఉదంతం ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్'లో పాల్గొని, ప్రసంగించేందుకు ఆమెకు అధికారికంగా ఆహ్వానం అందింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని, వ్యాలీడ్ వీసా, పాస్పోర్ట్ చేతిలో ఉన్నప్పటికీ ఆమెను నార్వే విమానాశ్రయంలో అడ్డుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దినపత్రిక 'డ్యాగ్సావిసెన్'లో జర్నలిస్టుగా పనిచేస్తున్న హెల్లె లింగ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బుధవారం ఉదయమే భారత్కు బయలుదేరాల్సి ఉండగా, చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తన వీసా రద్దు చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగే సదస్సులో మీడియా, పత్రికా స్వేచ్ఛ - ప్రజాస్వామ్యం అనే అంశంపై ప్యానెలిస్ట్, వక్తగా మాట్లాడాల్సి ఉందని తెలిపారు. ఈ పరిణామం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని, తన ప్రయాణానికి అనుమతించాలని ఆమె కోరారు.
3
Beranda › Unlabelled › మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్ హెల్లె లింగ్ కు వీసా రద్దు : అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చ
Subscribe to:
Post Comments (Atom)
