3

కొంపముంచిన కారు డెకరేషన్ : బురదలో పడిన పెళ్లికూతురు : ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

వియత్నాంలోని ట్యూన్ క్వాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో వరుడు లీ వాన్ వియెట్ (21), వధువు డామ్ థీ జువాన్ (19) కారులో ప్రయాణిస్తున్నారు. వధువు ఇంటి నుంచి వరుడి ఇంటికి పెళ్లి వేడుక కోసం బయలుదేరారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో వరుడి ఇంటికి చేరుకుంటారనగా అనుకోని ప్రమాదం ఎదురైంది. పెళ్లి సందర్భంగా కారును అందమైన పూలతో అలంకరించారు. అయితే ప్రయాణ సమయంలో బలమైన గాలులు వీయడంతో కారు ముందు భాగంలో ఏర్పాటు చేసిన పూల అలంకరణ ఒక్కసారిగా ఊడిపోయింది. గాలికి ఎగిరిన ఆ డెకరేషన్ నేరుగా కారు విండ్‌షీల్డ్‌పై పడింది. దీంతో డ్రైవర్‌కు రహదారి సరిగ్గా కనిపించలేదు. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బురద పొలంలోకి దూసుకెళ్లింది. సుమారు ఒక మీటరు లోతున్న బురదలో కారు బోల్తా పడటంతో వధూవరులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెళ్లికూతురు ఒంటినిండా బురదతో కనిపించింది. అయినప్పటికీ ఆ జంట పెళ్లిని వాయిదా వేయకుండా వేడుకను కొనసాగించింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Post

Previous
Next Post »