Ad Code

నైజీరియాలో కలరాకు 200 మంది మృతి బలి

నైజీరియాలోని ఈశాన్య ప్రాంతమైన బొర్నో రాష్ట్రంలో కలరా తీవ్ర భయాందోళనలను సృష్టిస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలోనే ఈ మహమ్మారి కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు వదిలారని 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్'  స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వ రికార్డుల ప్రకారం, జులై 12 నాటికి 198 మరణాలు సంభవించగా, 35,500 కంటే ఎక్కువ మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల వల్ల స్థానిక ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతూ తీవ్ర నిధుల, వసతుల కొరతను ఎదుర్కొంటున్నాయి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం, అరకొర పారిశుధ్య నిర్వహణ మరియు వైద్య వసతుల లోపమే ఈ స్థాయిలో వ్యాధి విస్తరించడానికి కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌లో సంభవించిన వర్షాలు, వరదల వల్ల కలరా ప్రమాదం ఉందని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ 10 రాష్ట్రాలను ముందే అప్రమత్తం చేసినప్పటికీ, బొర్నోలో పరిస్థితి నిమిషనిమిషానికి దిగజారింది. ఈ సంక్షోభాన్ని అదుపు చేసేందుకు నైజీరియా ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, మరియు ఎంఎస్ఎఫ్ సంస్థలు సంయుక్తంగా బాధితులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక యంత్రాంగం నిరోధక చర్యలను వేగవంతం చేసింది. కలుషితమైన డ్యామ్‌లు, జలాశయాల నీటిని తాగవద్దని ప్రజలకు సూచిస్తూ ఆంక్షలు విధించింది. వీటికి ప్రత్యామ్నాయంగా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu