సౌదీలో కేరళ అబ్దుల్ రహీమ్ కి ఉరి శిక్ష : రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించిన మలయాళీలు


కేరళలోని కోజీకోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా చేరాడు. అయితే ప్రమాదవశాత్తూ ఆ బాలుడు మృతి చెందడంతో రహీమ్‌పై బాలుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రహీమ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అబ్ధుల్ రహీమ్‌కు క్షమాభిక్ష పెట్టేందుకు బాలుడి కుటుంబం నిరాకరించింది. దీంతో 2018లో కోర్టు అతనికి మరణశిక్షను విధించింది. అబ్దుల్ రహీమ్‌ మరణ శిక్ష నుంచి బయటపడగలగాలి అంటే ఆ దేశ చట్టాల ప్రకారం భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.అబ్దుల్ రహీమ్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఒక్కటయ్యారు. విరాళాల రూపంలో 15 మిలియన్ల సౌదీ రియాల్స్ అంటే రూ.34 కోట్లు క్షమాధనంగా సౌదీ కోర్టుకు చెల్లించారు.దీంతో సౌదీ కోర్టు అతనిని విడుదల చేసింది. అబ్దుల్ రహీమ్ బుధవారం రాత్రి సౌదీ నుంచి కేరళ చేరుకున్నాడు. గురువారం కరిపూర్ విమానాశ్రయంలో దిగి తన స్వగ్రామానికి వెళ్లాడు. 2018 నుంచి సౌదీ అరేబియా జైలులో మగ్గుతున్న అబ్దుల్ రహీమ్‌ను తిరిగి చూస్తామని అనుకోలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ సందర్భంగా అబ్ధుల్ రహీమ్‌ను చూసి అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు. అబ్దుల్ రహీంను చూసి కన్నీటి పర్యంతమైన తల్లి ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్ తన విడుదల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.తన తల్లిని మళ్లీ కలుసుకున్నానంటే ఇందుకు తనకు సహకరించిన వారే కారణమని చెప్పుకొచ్చాడు.తమ సంతోషం రెట్టింపయిందని రహీమ్ బంధువులు, స్నేహితులు పేర్కొన్నారు. ఇకపోతే ఇంటికి చేరుకున్నఅబ్ధుల్ రహీమ్‌ను చూసిన తల్లి ఒక్కసారిగా అతడిని హత్తకుని ఏడ్చింది. ఈ దృశ్యం అందర్నీ కదిలించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org