జూన్ 4న షావోమి 17T విడుదల


దేశీయ మార్కెట్లో జూన్ 4న షావోమి 17T  విడుదల అవుతుంది. మొబైల్ ఫోటోగ్రఫీలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడమే లక్ష్యంగా ఈ మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది. ఇప్పటికే అమెజాన్‌లో దీనికి సంబంధించిన అధికారిక మైక్రోసైట్ లైవ్ అయింది. అక్కడ 'నోటిఫై మీ' బటన్ ద్వారా యూజర్లు అప్‌డేట్స్ పొందవచ్చు. తక్కువ ధరలో హై-ఎండ్ ఫీచర్లు కోరుకునే వారిని ఈ ఫోన్ ప్రధానంగా ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను అందించారు. ఇది గేమింగ్ ప్రియులకు, మల్టీ టాస్కింగ్ చేసేవారికి స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. లైకా భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను షావోమి కొనసాగిస్తోంది. ఇందులో 5x ఆప్టికల్ జూమ్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనివల్ల దూరంగా ఉన్న సబ్జెక్టులను కూడా చాలా క్లారిటీగా ఫోటోలు తీసుకోవచ్చు. దీనిలో 6,500mAh బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, హెవీ యూజర్లకు ఇది ఒక నమ్మకమైన ఆప్షన్. అలాగే కొత్త పవర్-సేవింగ్ డిస్‌ప్లే టెక్నాలజీ వల్ల బ్యాటరీ మరింత ఎక్కువ సేపు వస్తుంది. ఈ ఫోన్ హై-స్పీడ్ ర్యామ్ ఆప్షన్లతో లభించనుంది. భారత్‌లో యూజర్లు 8GB, 12GB వెర్షన్లలో తమకు నచ్చినది ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఇది iQOO 15R, నథింగ్ 4a ప్రో వంటి ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 40,000 వరకు ఉండొచ్చని అంచనా. ఇక ఎర్లీ బయ్యర్స్ కోసం బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org