హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈరోజు నాంపల్లిలోని సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేసిన దాడిలో ఓ బాధితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ ఏసీబీ వలకు చిక్కారు. కార్యాలయంలోనే సీఐ మహేందర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న సీఐ మహేందర్ బాధితులు ఇంకెంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. గతంలో ఎవరెవరి దగ్గర నుండి ఇలా వసూళ్లకు పాల్పడ్డారు? ఈ కేసులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీఐ మహేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నట్లు సమాచారం.
0 Comments