తుంగభద్రలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో నిన్న గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. యమన్ చంద్ర, సతీష్ చంద్ర, ధను మృతదేహాలను వెలికి తీసినట్లు జాలర్లు తెలిపారు. గల్లంతైన రాఘవేంద్ర, సంధ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. సరదాగా ఈతకు వెళ్లి నదిలో ఐదుగురు గల్లంతైన విషయం తెలిసిందే.
Comments
Post a Comment