Ad Code

దురంతో ఎక్స్‌ప్రెస్ టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన క్యాటరింగ్ సిబ్బంది !


ముంబై (ఎల్ టీటీ) నుండి ఎర్నాకుళం వెళ్లే 12223 దురంతో ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ కోచ్‌లో క్యాటరింగ్ సిబ్బంది రైలు టాయిలెట్ లోపల ఉండి ప్రయాణికులకు భోజనం వడ్డించే గిన్నెలు, స్పూన్లు కడుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ టాయిలెట్ నేలపైనే ఆహార పాత్రలు ఉంచిన బాస్కెట్ కూడా ఉంది. 'ట్రూత్ ఆన్ ట్రాక్' అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిని గమనించిన ఒక ప్రయాణికుడు తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తూ సదరు సిబ్బందిని గట్టిగా నిలదీశాడు. “ఏం చేస్తున్నారు? పాత్రలు శుభ్రం చేయడానికి ఇది సరైన ప్రదేశమా?” అని ప్రశ్నించగా, లోపల ఉన్న వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు. బయట ఉన్న క్యాటరింగ్ అటెండెంట్‌ను అడగ్గా“నేను ఇప్పుడే చూశాను, సాధారణంగా పాత్రలు కడిగేవారు అక్కడే కడుగుతారు” అంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. ప్రీమియం క్లాస్ టికెట్లకు వేల రూపాయలు చెల్లించి ప్రయాణించే తమకు ఇలాంటి మురికి కూపంలో కడిగిన పాత్రల్లో భోజనం పెడతారా అని నెటిజన్లు రైల్వే శాఖపై మండిపడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu