అమెరికాలో కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాలలో అత్యంత ప్రతిభ కనబర్చే వారికి అందించే ప్రతిష్ఠాత్మక 'మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్' అవార్డును తెలుగు అమ్మాయి అనన్య గోలి కైవసం చేసుకుంది. ఈ పురస్కారాల్లో భాగంగా ఆమెకు 'స్టేట్ హానరబుల్ మెన్షన్' లభించడం విశేషం. ఇంతటి అరుదైన గౌరవాన్ని అందుకున్న అనన్య గోలి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోలి కృష్ణచైతన్య, సంపా సిన్హా దంపతుల కుమార్తె ఈమె. ప్రస్తుతం వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. అనన్య అక్కడ మిన్నెసోటాలోని ప్రసిద్ధ 'ఈడెన్ ప్రైరీ హైస్కూల్'లో విద్యనభ్యసిస్తోంది. చిన్న వయసులోనే సాంకేతిక రంగంపై ఉన్న ఆసక్తితో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. చిన్న వయసులోనే కంప్యూటర్ సైన్స్, కోడింగ్ వంటి సాంకేతిక విషయాలపై అనన్యకు అద్భుతమైన పట్టు ఉంది. క్లాస్ రూమ్‌లోనే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త టెక్నాలజీ ప్రాజెక్టులలో చురుగ్గా పాల్గొంది. ఇక అంతేకాకుండా, తోటి విద్యార్థులను నడిపించే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడం వల్లే అమెరికా నిపుణులు ఆమెను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు.
0 Comments