గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బలమైన గాలులకు హోర్డింగ్ ఫ్రేమ్ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్, స్కూటీ రైడర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోడ్డుపై వెళ్తున్న ఒక బైకర్ కూలుతున్న హోర్డింగ్ ఫ్రేమ్ కింద నుంచి తల ఒంచి తృటిలో వేగంగా వెళ్లిపోయాడు. ఇంతలో ముగ్గురు ప్రయాణిస్తున్న స్కూటీ అక్కడకు చేరుకున్నది. ప్రమాదాన్ని పసిగట్టిన స్కూటీ రైడర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో దానిపై ఉన్న ముగ్గురు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments