Ad Code

జూన్ 5న ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ !

దేశీయ మార్కెట్లో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవంగా రాబోతున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును  ఆవిష్కరించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏ మోడల్ అన్నది అధికారికంగా ప్రకటించకపోయినా, ‘వాగన్ ఆర్’ లేదా ‘ఫ్రాంక్స్’ ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్ తో పాటు, ఇథనాల్  మిశ్రమంతో లేదా 100 శాతం ఇథనాల్‌తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇథనాల్ శాతం ఆధారంగా వీటిని E20, E85, E100 అని పిలుస్తారు. రాబోయే మారుతి కారు 100 శాతం ఇథనాల్‌ తో నడిచేలా రూపొందించబడింది. ఇది మన దేశంలోని బయో-ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడానికి మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక గొప్ప అడుగు. ఇథనాల్‌కు తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది, ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్లలో తుప్పు పట్టడానికి దారితీయవచ్చు. అందుకే, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూయల్ సిస్టమ్స్, యాంటీ-రస్ట్ ఇంజన్ కాంపోనెంట్స్ , మార్పులు చేసిన ఇంజన్ ట్యూనింగ్‌ను అమర్చారు. దీనివల్ల ఎక్కువ ఇథనాల్‌ను కూడా ఇంజిన్ సమర్థవంతంగా భరిస్తుంది. ఈ వాహనాల ద్వారా భారతదేశం తన ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు ప్రస్తుతం మన అవసరాల్లో 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం . ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు ఇంధన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రారంభ దశలో, సాంకేతిక మార్పుల కారణంగా ఒక్కో వాహనంపై సుమారు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు అదనపు వ్యయం ఉండవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.

Post a Comment

0 Comments

Close Menu