ఇంగ్లండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్ వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ జట్టులో డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. పదేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన కరేబియన్ జట్టు ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. అటు విండీస్ పురుషల జట్టు కూడా 2016 తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. దీంతో తమ 10 ఏళ్ల సుదీర్ఘ నిర్ణీక్షణకు తెరదించాలని విండీస్ అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. సాధరణంగా ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ వెస్టిండీస్ సెలెక్టర్లు అనూహ్యంగా స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. . అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, మాండీ మంగ్రూ, కరిష్మా రామ్‌హారక్, హేలీ మాథ్యూస్, జైదా జేమ్స్ వంటి స్పిన్నర్లు విండీస్ ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. ఈ టోర్నీలో విండీస్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌తో పాటు ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు జూన్ 13న సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రపంచ కప్ సమరాన్ని ప్రారంభించనుంది.
0 Comments