Ad Code

రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతున్నారు !


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో నిర్వహించిన చిట్ చాట్‌లో హరీష్ రావు తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని కేసీఆర్‌పై ఒట్టేసి చెప్పాలని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ బతికున్నంత కాలం బీఆర్ఎస్‌లోనే ఉంటానని.. నా పుట్టుక బీఆర్ఎస్‌లో, చావుకూడా బీఆర్ఎస్‌లోనని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ భరితమైన కౌంటర్ ఇచ్చారు. తన పొలిటికల్ అస్తిత్వం, విధేయతపై వస్తున్న ఊహాగానాలకు గట్టి సమాధానమిచ్చారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా నా జీవితం అంతా కేసీఆర్ తోనే ముడిపడి ఉంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానం కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే సాగిందని, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని ఎవరూ శంకించలేరని పేర్కొన్నారు. బతికున్నంత కాలం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతూ ప్రతిపక్షంలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, కానీ తన విషయంలో ఆ పప్పులు ఉడకవని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

Post a Comment

0 Comments

Close Menu