కోహెడ అంతర్జాతీయ మార్కెట్ పనుల పరిశీలన


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత మార్కెట్ దేశానికే తలమానికంగా నిలుస్తుంది…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మెరుగైన ప్రమాణాలతో కూడిన మార్కెట్ గా ఉండబోతుంది. ఆదివారం ఉదయం కోహెడ మార్కెట్ శంకుస్థాపన నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్ర మోహన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి బాయి .గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు..పాలకవర్గం సభ్యులు కలిసి పరిశీలించడం జరిగింది. అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె సురేంద్ర మోహన్ కోహెడ గుట్ట శ్రీశ్రీశ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు అధికారులు సభ ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు. కొన్ని మార్పు చేర్పులను సూచనలను సంబంధిత అధికారులకు తెలియ చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org