ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బండిబుగ్యో ఎబోలావైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టినట్లు రష్యా ప్రకటించింది. కాంగో, ఉగాండాలలో బుండి బుగ్యో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ ఆందోళన మధ్య బండిబుగ్యో ఎబోలా వైరస్ రకాన్ని అదుపు చేసేందుకు టీకాను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. మధ్య ఆఫ్రికాలో వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత రష్యా ఈ ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం వైరస్ సోకిన సగం మంది చనిపోతున్నారు. కొత్త కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఎబోలా వ్యాక్సిన్ పై రష్యా ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ ఆ వ్యాక్సిన్ వినియోగం సురక్షితమైనదేనా, ఎబోలా వైరస్ పై ప్రభావం చూపుతుందా అని తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ నుంచి డేటా, పీర్ రివ్యూడ్, నియంత్రణ సమీక్ష వంటివి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. రష్యన్ శాస్త్రవేత్తలు కొత్త ఎబోలా స్ట్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్‌ను విజయవంతంగా కనుగొన్నారని,దీనికి సంబంధించి వివరాలను 'X' సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఓ పోస్టును షేర్ చేసింది దక్షిణాఫ్రికాలోని రష్యన్ ఎంబసీ. ప్రస్తుతం కాంగోలో వ్యాప్తికి కారణమవుతున్న బండిబుగ్యో ఎబోలావైరస్ స్ట్రెయిన్ నుంచి కూడా ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పించగలదని ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో చెప్పినట్లు సమాచారం. బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, రాయిటర్స్ నివేదికల ప్రకారం, సర్వసాధారణమైన జైర్ ఎబోలావైరస్ రకంలా కాకుండా, బుండిబుగ్యో ఎబోలావైరస్ కోసం టీకాలులేవీ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కాంగో, ఉగాండాలో దాదాపు వెయ్యి కేసులు నమోదు కాగా అందులో 50 శాతం మరణాలున్నాయి. వందలాది అనుమానిత కేసులు కూడా ఉన్నాయి.
ఎబోలా వైరస్ కు టీకా కనిపెట్టినట్లు ప్రకటించిన రష్యా
by Telugu Lo Computer at May 28, 2026
Labels:
international
,
new cases continue to be reported
,
Russia Announces Discovery of Ebola Virus Vaccine
,
Russian Health Minister Mikhail Murashko
,
the virus proves fatal for half of those infected
,
WHO estimates
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment