Ad Code

ఇంటి ముందు పార్క్‌ చేసిన మోటార్‌ సైకిల్‌ మాయం : బైక్‌ విడిభాగాలను వేరు చేసి 500 రూపాయలకే అమ్మిన దుండగుడు


చెన్నై సమీపం అయపాక్కంలో ఇంటి ముందు పార్క్‌ చేసిన మోటార్‌ సైకిల్‌ను దొంగిలించి, దాని భాగాలను విడదీసి కేవలం 500 రూపాయలకే పాత ఇనుప సామా న్ల కొట్టులో అమ్మేసిన వింత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయపాక్కం ప్రాంతానికి చెందిన భరత్‌ వేల్‌ ఒక ప్రైవేట్‌ కంపెనీ లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో తన బైక్‌ను ఎప్పటిలాగే ఇంటి ముందు నిలిపి ఉంచారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్‌ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో అయపాక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భరత్‌ వేల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బైక్‌ దొంగిలించిన వ్యక్తి దానిని నేరుగా అమ్మకుండా, విడిభాగాలను వేరు చేసి ఒక పాత ఇనుప సామాన్ల అంగడిలో కేవలం 500 రూపాయలకే అమ్మినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిని అనుసరించి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి బైక్‌ దొంగిలించిన వ్యక్తి దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులను బురిడీ కొట్టించి తక్కువ ధరకే బైక్‌ అమ్మేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu