అడవి కోడిని తింటే మూడేళ్ల జైలు శిక్ష !


డవుల్లో మాత్రమే జీవించే అరుదైన కోడి 'అడవి కోడి'. ఆంగ్లంలో 'గ్రే జంగిల్‌ ఫౌల్‌' అని పిలిచే ఈ అడవి కోళ్లు కేవలం మన దేశంలో మాత్రమే కనిపిస్తాయి. వీటి విశిష్టత, అంతరించిపోతున్న రకాల దృష్ట్యా భారత ప్రభుత్వం వీటిని 'వన్యప్రాణి రక్షణ చట్టం' పరిధిలోకి చేర్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ అడవి కోళ్లను వేటాడినా, వీటికి హాని తలపెట్టినా భారీ జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇవి ఎక్కువగా నేల పైనే తిరుగుతూ జీవిస్తాయి. నేలపైనా లేదా చెట్లపైనా గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. అడవిలో దొరికే గింజలు, చెదలు, చిన్న చిన్న కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. చిన్న అలికిడి వినపడినా క్షణాల్లో అక్కడి నుంచి పారిపోతాయి. ఒకవేళ ప్రాణాపాయం ఉందని గ్రహిస్తే మాత్రం వెంటనే చెట్లపైకి ఎగిరిపోతాయి. తాజాగా తెలంగాణలోని  మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో ఈ అరుదైన గ్రే జంగిల్‌ ఫౌల్‌ కెమెరా కంటికి చిక్కింది. అడవుల రక్షణ, వన్యప్రాణుల మనుగడపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org