ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ నిధుల సమీకరణ చేపట్టింది. మొత్తం 65 బిలియన్ డాలర్ల నిధులను సేకరించగలిగింది. ఈ క్రమంలో ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ ఏకంగా 965 బిలియన్ డాలర్లుగా తేలింది. ఆల్టిమీటర్ క్యాపిటల్, డ్రాగోనీర్, గ్రీనోక్స్, సెక్వోయా క్యాపిటల్ వంటి సంస్థలు ఆంథ్రోపిక్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఒక్కో సంస్థ రెండు బిలియన్ డాలర్ల మేర ఆంథ్రోపిక్‌లో ఇన్వెస్ట్ చేశాయి. టెక్ దిగ్గజాలు అనేకం ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటిపోయాయి. ఎన్విడియా, ఆల్ఫబెట్, యాపిల్ సంస్థల మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు పైనే ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ (3.1 ట్రిలియన్ డాలర్లు), అమెజాన్ (2.8 ట్రిలియన్ డాలర్లు) కూడా దూసుకెళుతున్నాయి. ఏఐకి మారుపేరుగా మారిన చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ కూడా ఐపీఓకు సిద్ధమవుతోంది. 800 బిలియన్‌ల నుంచి ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఆంథ్రోపిక్ ఇప్పటికే 900 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇదే ఒరవడి కొనసాగితే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకున్న తొలి ఏఐ స్టార్టప్‌గా ఆంథ్రోపిక్ అవతరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ
by Telugu Lo Computer at May 29, 2026
Labels:
Altimeter Capital
,
and Sequoia Capital have invested in Anthropic
,
Anthropic's Market Valuation Nears the Trillion-Dollar Mark
,
Dragoneer
,
Greenoaks
,
technology
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment