దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగం, సాంకేతికత, ఆధునికతతో ఉన్న ప్రత్యేక మోడల్‌గా ఏథర్ 450 ఏపెక్స్ నిలుస్తోంది. ఇది కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాకుండా స్టైల్ కి ప్రతీకగా నిలుస్తుంది .3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ తో Warp+ మోడ్ ద్వారా కేవలం 2.9 సెకన్లలో 0-40 kmph వేగాన్ని చేరగల ఈ స్కూటర్ వేగం ,ఉత్సాహాన్ని అందిస్తుంది. 100 kmph టాప్ స్పీడ్ , 157 km IDC రేంజ్ తో ఇది నగర ప్రయాణాలతో పాటు దూర ప్రయాణాలకు కూడా సరైన ఎంపికగా నిలుస్తోంది. దీనిలో అందించిన Infinite Cruise ఫీచర్ రైడింగ్ అనుభవాన్ని సౌకర్యవంతంగా మార్చే ప్రత్యేక సాంకేతికత. ఈ ఫీచర్ ద్వారా రైడర్ ఒకసారి వేగాన్ని సెట్ చేస్తే స్కూటర్ అదే స్థిరమైన స్పీడ్‌లో నిరంతరంగా ప్రయాణిస్తుంది. దీని వల్ల లాంగ్ రైడ్స్ సమయంలో థ్రాటిల్‌ను నిరంతరం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీనితో చేతులకు ఒత్తిడి తగ్గి ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది. Snapdragon ప్రాసెసర్‌తో 7 ఇంచ్ TFT టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, WhatsApp నోటిఫికేషన్లు, కాల్ & మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి 3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ IPX7 వాటర్ రెసిస్టెన్స్‌తో ఉంటుంది . కాబట్టి వర్షాకాలంలో కూడా నమ్మకంగా ప్రయాణించవచ్చు. 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ వినియోగదారులకు భరోసా ఇస్తుంది. Rain, Road , Rally అనే మూడు ట్రాక్షన్ మోడ్స్ ఉంటాయి. సేఫ్టీ పరంగా ABS బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ కంట్రోల్ , వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ వినియోగదారులకు భద్రతను కలిగిస్తాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ , మోనోషాక్ రియర్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. Indium Blue రంగు, ట్రాన్స్పరెంట్ సైడ్ ప్యానెల్స్ వంటి డిజైన్ రోడ్డు మీద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 12 ఇంచ్ ట్యూబ్ లెస్ అలోయ్ వీల్స్ ఉంటాయి.
ఆధునిక సాంకేతికతతో ప్రత్యేక మోడల్‌గా నిలుస్తున్న ఏథర్ 450 ఏపెక్స్
by Telugu Lo Computer at May 30, 2026
Labels:
3.7 kWh lithium-ion battery
,
A Standout Model Powered by Modern Technology
,
and utilizing the 'Warp+' mode
,
Ather 450 Apex
,
automobile
,
business
,
electric scooter
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment