తృణమూల్ లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీపై దాడి చోటు చేసుకుని 24 గంటలు కూడా గడవక ముందే తృణమూల్ సీనియర్ నాయకుడు, శ్రీరామ్ పూర్ లోక్ సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీపై తాజాగా హుగ్లీ జిల్లాలో దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడి, పార్టీ నాయకులు, కార్యకర్తల అరెస్టులకు నిరసనగా చేపట్టిన ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసనల్లో భాగంగా నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి వ్యతిరేక నినాదాలు చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకన్నారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగింది. మొదట ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరిగింది. ఇది ఘర్షణకు దారితీసింది. తమ పార్టీ నాయకులను విడుదల చేయాలంటూ హుగ్లీ జిల్లా పరిధిలోని చండితాల పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందించడానికి వెళ్తోన్న సమయంలో బీజేపీ నాయకులు ఆయనపై దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. చోర్.. చోర్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు సమీపించినప్పుడు కల్యాణ్ బెనర్జీ, ఆయన అనుచరులు, టీఎంసీ కార్యకర్తలను కొందరు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆయనను చుట్టుముట్టారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పిడిగుద్దులు గుద్దారు. కిందికి తోసివేశారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు తక్షణమే జోక్యం చేసుకున్నారు. వారిని విడిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకులు తనపై రాళ్లు విసిరినట్లు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారిపై ఘాటు విమర్శలు చేశారు. స్వయంగా సువేందు అధికారి ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తోన్నాడని, అతనొక నిరంకుశుడని మండిపడ్డారు.
తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై బీజేపీ కార్యకర్తలు దాడి !
by Telugu Lo Computer at May 31, 2026
Labels:
incident took place during a protest against the attack on Abhishek Banerjee and the arrest of party leaders and workers
,
Trinamool MP Kalyan Banerjee attacked by BJP workers
,
west bengal
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment