Ad Code

ఇసుక లారీ వెళ్తుండగా ఒక్కసారిగా కూలిపోయిన వంతెన


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని దొంగపిండి గ్రామం వద్ద ఇసుక లారీ వెళ్తుండగా వంతెనఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీతో సహా వంతెన కుంగిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ వంతెన కూలిపోవడంతో దొంగపిండి గ్రామానికి రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకే ఈ మార్గమే ఉండటంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్య సేవల కోసం నానా పాట్లు పడుతున్నారు. గ్రామానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu