Ad Code

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై ?


ముంబై ఇండియన్స్ కెప్టెన్ కు హార్దిక్ పాండ్యా  గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే ఈ జట్టులో కొనసాగలేనని ఫ్రాంచైజీ ఓనర్స్‌కు సమాచారమిచ్చినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురికావడం, పూర్తిగా అలసిపోవడం వంటి కారణాలతో జట్టును విడిచిపెట్టడానికి హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడని పేర్కొంది. ఐపీఎల్ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ స్థానంలో సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని తప్పుబట్టారు. ఆ కోపాన్ని హార్దిక్ పాండ్యాపై చూపించారు. ముంబై మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్ పాండ్యా గేలి చేస్తూ తీవ్రంగా అవమానించారు. ఆ సీజన్‌లో ముంబై దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ అభిమానుల నుంచి నిరసన ఎదుర్కొన్న పాండ్యా.. మెరుగైన ఫలితాలనే అందించాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. తాజా సీజన్‌లో సీనియర్ల నుంచి సహకారం కొరవడటం, ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలను మాత్రమే నమోదు చేసింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతోనే హార్దిక్ పాండ్యా జట్టును వీడాలనే నిర్ణయం తీసుకున్నాడని, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు చేజారిన తర్వాత.. హార్దిక్, ముంబై ఇండియన్స్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ ఫ్రాంచైజీ టాస్ సోర్స్ వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu