Ad Code

వివో టీ5 4జీ ఫోన్ ను విడుదల


గ్లోబల్ మార్కెట్లలో వివో టీ5 4జీ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్, వివో T5 ప్రో 5జీ, వివో T5x 5జీ ఫోన్లలో కంపెనీ మిడ్-రేంజ్ టీ5 లైనప్‌లో మూడో మోడల్. ఈ 4జీ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రెండు కలర్ ఆప్షన్లలో సింగిల్ RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. ఇది క్వాల్‌కామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,200mAh బ్యాటరీ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP మెయిన్ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 8GB LPDDR4x ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ వివో టీ5 ధర 5,799 MXN (సుమారు రూ. 32,000). ఇది బ్లాక్, గోల్డ్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అయ్యే డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.75-అంగుళాల HD+ (720×1,570 పిక్సెల్స్) ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 83శాతం NTSC కవరేజ్ 1,250 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. వివో టి5 ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త వివో టి5 క్వాల్‌కామ్ 6nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌లో 1.9GHz క్లాక్ స్పీడ్‌తో 4 ఎఫిషియెన్సీ కోర్లు 2.9GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో 4 పెర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB LPDDR4x ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. అదనంగా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ రియర్ కెమెరా ఉంది. చివరగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో టీ5లో 32MP (ఎఫ్/2.45) ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, USB టైప్-సీ పోర్ట్, జీపీఎస్, BeiDou, GLONASS, Galileo, QZSS వంటి సెన్సార్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, గైరోస్కోప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్ కొలతలు 166.64×78.43×8.39mm,బరువు సుమారుగా 219 గ్రాములు. ఈ ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ ఉంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu