తెలంగాణ రాష్ట్రంలో ఇసుక, గ్రానైట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు ఏకకాలంలో కొనసాగుతుండటంతో వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనిఖీల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ గట్టి బందోబస్తు మధ్య ఈ దాడులు జరుగుతున్నాయి. దాదాపు నాలుగు ప్రముఖ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, వాటి అధినేతల నివాసాల్లో మొత్త 8 చోట్ల ఈడీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు నాలుగు కంపెనీలు జీఎస్టీ ఎగ్గొట్టడమే కాకుండా, తద్వారా వచ్చిన రూ.కోట్లను అక్రమ సంపాదనను వేరే మార్గాల్లోకి మళ్లించినట్లు వచ్చిన బలమైన ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, బ్యాంక్ ఖాతాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను అధికారులు చెక్ చేస్తున్నారు.
0 Comments