Ad Code

దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం : తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం


క్షిణ తెలంగాణ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగుపాటు హెచ్చరిక చేయటంతో పటుగా రాగల మూడు గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని సూచించింది. బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu