Ad Code

బోట్ నుంచి స్టోర్మ్ కాల్ 4, అల్టిమా వోగ్ 2 స్మార్ట్‌వాచ్‌లు విడుదల : టైప్-సితో ఛార్జింగ్‌


దేశీయ మార్కెట్‌లో బోట్ నుంచి స్టోర్మ్ కాల్ 4, అల్టిమా వోగ్ 2 అనే పేరుతో రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదల అయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా డైరెక్ట్ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇవి రావడం విశేషం. ప్రతిదానికీ విడిగా ఛార్జర్ వెతుక్కునే తిప్పలు లేకుండా ఫోన్ కేబుల్‌తోనే వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు.  బోట్ స్టోర్మ్ కాల్ 4 రూ.1,599కే లభిస్తుండగా, ప్రీమియం లుక్ ఉన్న అల్టిమా వోగ్ 2 ధరను రూ.2,799గా నిర్ణయించారు. స్టోర్మ్ కాల్ 4 ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభం కాగా, జూన్ 12 నుండి ఇవి మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలో వచ్చే స్టోర్మ్ కాల్ 4 మోడల్‌ 1.96 ఇంచుల పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 12 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి అన్ని రకాల హెల్త్ ఫీచర్లతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. స్టైలిష్, ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం అల్టిమా వోగ్ 2 బాగా నచ్చుతుంది. దీనిలో 1.96 ఇంచుల బ్రైట్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు మెటాలిక్ ఫ్రేమ్ డిజైన్ ఇచ్చారు. ఇది 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మిగిలిన హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లన్నీ స్టోర్మ్ కాల్ 4 లాగే ఇందులోనూ కొనసాగించారు.

Post a Comment

0 Comments

Close Menu