హారాష్ట్ర లోని పుణెలో రూ.2,000-2,500 కోట్లతో వచ్చే మూడేళ్ల కాలంలో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు బజాజ్‌ ఇంటెగ్రేటెడ్‌ హెల్త్‌ సిస్టమ్‌ ఎండీ నీరవ్‌ బజాజ్‌ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 12 పట్టణాల్లోకి సేవలను విస్తరిస్తామని తెలిపారు. క్లినిక్‌లు, అంబులేటరీ సేవలు, హోమ్‌కేర్‌, హాస్పిటల్‌తో కూడిన ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. వ్యాధుల నివారణ నుంచి తక్షణ చికిత్స వరకు ఆస్పత్రికి దూరంగా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సంరక్షణ నమూనా చాలా భిన్నమైందంటూ దీన్ని సొంతంగానే నిర్మింకుంటామని చెప్పారు. పడకల సంఖ్య, ఒక్కో పడకవారీ ఆదాయం తదితర సంప్రదాయ కొలమానాలను తాము అనుసరించబోమన్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు.