మధ్యప్రదేశ్ లోని ఛతర్ పుర్ జిల్లా మహారాజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటిపూర్ గ్రామానికి చెందిన రామ్ మిలాన్ (42) అనే రైతు తన భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాడు. పెద్ద కూతురు పెళ్లి జూన్ 25న జరగాల్సి ఉంది. చాలా సంవత్సరాల నుంచి భార్య పక్షవాతంతో బాధపడుతోంది. అటు ఆర్థికంగా, ఇటు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. పాపాల నుంచి విముక్తి పొందేందుకు అతడు బాబాగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. తన పొలం దగ్గర జననాంగాన్ని గొడ్డలితో నరుక్కొని దాన్ని బావిలో పడేశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతడిని ఛతర్ పుర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
0 Comments