Ad Code

కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రపంచ నో - టొబాకో దినోత్సవం


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రపంచ నో - టొబాకో దినోత్సవం సందర్భంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పొగాకు వల్ల జరిగే అనారోగ్య పరిస్థితులను వివరించారు. పొగాకు ఏ రూపంలో వాడినా అది క్యాన్సర్ కు దారితీస్తుందని , నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ నందన్, కిమ్స్ లోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరాజు చెప్పారు. పోగాకు వాడకం వల్ల కుటుంబంపై తీవ్రమైన భారం పెను పరిణామాలు చోటు చేసుకుంటాయని డాక్టర్ రాజు చెప్పారు. ప్రతి ఒక్కరూ పొగాకును దూరంగా ఉంటే చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చని, డాక్టర్ తెలిపారు. పొగాకు వాడడం వల్ల అనేకమంది ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. గడచిన 25 నుంచి 30 సంవత్సరాలుగా తాను ప్రత్యక్షంగా చూసి ఈ మాట చెబుతున్నానని, డాక్టర్ శ్రీనివాసరాజు అన్నారు. ఒక సిగరెట్టు పీల్చడం వల్ల రోజులో ఆయుషు ఏడు గంటలు క్షీణిస్తుందని డాక్టర్ రాజు విశ్లేషించారు.

Post a Comment

0 Comments

Close Menu